న్యూస్ డెస్క్: మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలోని ఏఏ సాకీ బీడీ సెంటర్‌లో 141వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే)ను విజయవంతం చేయాలని ఉద్దేశ్యంతో వాల్ పోస్టర్‌ను ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రంగారెడ్డి, బీడీ కార్మిక సంఘం సీనియర్ నాయకులు గంగాధర్, రాష్ట్ర సహాయ కార్యదర్శి లక్ష్మణ్ పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేబర్ చట్టాలను రద్దు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీడీ కార్మికులు సిద్ధవ సుగుణ, నరసవ్వ, సుజాత, లక్ష్మి, మంజుల, పుష్పలత, చంద్రకళ, కళావతి, బుధవా, బాలమణి తదితరులు పాల్గొన్నారు.

Avatar photo

By Editor

Digital journalist and media professional delivering accurate breaking news, impactful storytelling, and engaging content across modern platforms.