ఐనవోలు న్యూస్ : తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వైద్యం రాజగోపాల్‌ను ఐనవోలు మండలం వెంకటాపూర్ గ్రామంలోని పద్మశాలి భవన్‌లో స్థానిక నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ఐనవోలు మండల అధ్యక్షులు గోరంట్ల కుమారస్వామి ఆధ్వర్యం వహించారు.

ఈ సందర్భంగా వైద్యం రాజగోపాల్ మాట్లాడుతూ పద్మశాలి సమాజం ఐక్యంగా ఉంటేనే తమ హక్కులను సాధించుకోవచ్చని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి పద్మశాలి బంధువుకు అందేలా సంఘం తరఫున కృషి చేస్తామని తెలిపారు. సమాజ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సంఘ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా పద్మశాలి నాయకులు, గ్రామ అధ్యక్షులు పాము శ్రీనివాస్, మండల కార్యదర్శి యెలిగేటి సత్యనారాయణ, గ్రామ ప్రధాన కార్యదర్శి పాము శ్రీనివాస్, యెలిగేటి సత్యనారాయణ (డీఆర్), యెలిగేటి వీరాస్వామి, పాము కోటి తదితరులు పాల్గొన్నారు