ముఖ్యఅతిథిగా పాల్గొన్న గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు

న్యూస్ డెస్క్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో గల బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి ఫలితాల్లో స్కూల్ టాపర్స్ గా నిలిచిన విద్యార్థులను వారి తల్లిదండ్రుల సన్మాన కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు విద్యార్థులను శాలువాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహదేవ్పూర్ బాలికల పాఠశాల విద్యార్థులు మంచి మార్కులు సాధించినందుకు అభినందనలు తెలియజేశారు. ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయడం వల్లనే మంచి ఫలితాలు సాధించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న మహదేవ్పూర్ సర్పంచి హసీనా బాను మాట్లాడుతూ మంచి మార్కులు పొందిన విద్యార్థులు భవిష్యత్తులో కూడా కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని అన్నారు. సర్పంచ్ మాట్లాడుతూ తాను పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే మహాదేవపూర్ బాలికల పాఠశాల విద్యార్థులు ఎక్కువ ర్యాంకులు పొందడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులకు నగదు బహుమతిని అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం కనీసం ముగ్గురు నలుగురు విద్యార్థులకు IIIT బాసరలో అడ్మిషన్ లభించే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సరిత, మడక మధు, హోలీ పాష వీరేశం, లీలారాణి, ప్రసూన ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.