న్యూస్ డెస్క్ : మహబూబాబాద్ జిల్లా మంగళవారం పట్టణంలోని గిరిజన భవన్ లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – రైతువారంలో భాగంగా మహబూబాబాద్ నియోజకవర్గ స్థాయి పంట మార్పిడి ద్వారా ఉద్యాన పంటల సాగు, ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంపుదల, ప్రత్యామ్నాయ పంటల సాగు అవగాహన సదస్సును జిల్లా ఉద్యాన & పట్టు పరిశ్రమ శాఖ, TG OILFED, వ్యవసాయ శాఖ, సహకార శాఖ, మార్కెటింగ్ శాఖ, కృషి విజ్ఞాన కేంద్రం, ఉద్యాన పరిశోధన స్థానం, ఉద్యాన కళాశాల, పశు సంవర్ధక శాఖ వారి సహకారంతో నిర్వహించారు.

మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలు సాగు చేయాలని, నిత్యం రోగనిరోధక శక్తికి, ఆరోగ్యంగా ఉండటానికి పోషకాలు అందించే పండ్ల తోటలు అయిన జామ, నిమ్మ, అరటి, బొప్పాయి, సీతాఫలం, పనస, నేరేడు, అవకాడో, ఫ్యాషన్ ఫ్రూట్, కూరగాయలు, ఆకు కూరలు, మునగ, వెదురు మొదలైనవి సాగు చేయాలని తద్వారా ఎకరానికి లక్ష రూపాయలు నికర ఆదాయం పొందాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.

ప్రతి రైతు పొలం గట్ల మీద, పొలం చుట్టూ, పెరట్లో, ఆయిల్ పామ్, పండ్ల తోటలలో అంతర పంటలుగా, డాబాల మీద, ఇంటి ముంగిట రోజువారి కూరగాయల సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు, నూతన రకాల సాగు, ప్రో ట్రే లో నారు పెంపకం, ఎత్తు మడులు, మల్చింగ్, బిందు సేద్యం, ఫర్టిగేషన్, వేప పిండి, ఆముదం పిండి వాడకం, వేప నూనె పిచికారి చేయటం, పసుపు రంగు అట్టల వాడకం, సిఫారసు చేసిన ఎరువులు వాడటం, పందిరిపై కూరగాయల సాగు, ట్రెల్లిస్ మెథడ్ లో టమాటా సాగు మొదలైన పద్ధతులు పాటించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ గుగులోతు జ్యోతి, వ్యవసాయ మార్కెట్ వైస్ ఛైర్మన్ కమిటీ మదన్ గోపాల్ లోయా, జిల్లా ఉద్యాన & పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న, జిల్లా వ్యవసాయ అధికారి బి. సరిత, జిల్లా సహకార అధికారి ఎన్. వెంకటేశ్వర్లు, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డా. బోడె పూడి కిరణ్ కుమార్, సహాయ వ్యవసాయ సంచాలకులు ఎ. శ్రీనివాస రావు, వార్డ్ కౌన్సిలర్ ఎస్. దిలీప్, ఆయిల్ పామ్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ వల్లూరి కృష్ణ రెడ్డి, ఆయిల్ పామ్ అభ్యుదయ రైతు డా. యానాల ఇంద్ర సేనా రెడ్డి, ఆయిల్ పామ్ అభ్యుదయ రైతు బొబ్బల యాకూబ్ రెడ్డి, ఆయిల్ పామ్ అభ్యుదయ రైతు మిట్టకంటి ఉపేందర్ రెడ్డి, మల్బరీ అభ్యుదయ రైతు వేం పార్థ సారధి రెడ్డి, ఉద్యాన అధికారి శాంతి ప్రియదర్శిని, వ్యవసాయ అధికారులు తిరుపతి రెడ్డి, అబ్దుల్ మాలిక్, రాజు, పలువురు ఆయిల్ ఫెడ్ విస్తరణ సిబ్బంది, వ్యవసాయ, ఉద్యాన విస్తరణ అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు.