ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నందు ‘ఊయల’ కలెక్టరేట్ లో ‘దత్తత సహాయక కేంద్రం’ ను ప్రారంభించిన: జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్
న్యూస్ డెస్క్ : మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నందు ఈరోజు మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో *ఊయల* కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ గారు ఇంచార్జి జిల్లా సంక్షేమ అధికారి శిరీష గారు మాట్లాడుతూ కన్న పిల్లలను పెంచి పోషించలేని వారు, వద్దనుకునే వారు చెత్త కుప్పల్లో, చెట్ల పొదల్లో వేయకూడదని ప్రభుత్వానికి అప్పగించడం ద్వారా చట్టబద్ధంగా దత్తత ఇస్తామని అలాంటి వారు ఎవరైనా ఉంటే ఏర్పాటు చేసిన *ఊయల* లో వేయాలని, వారి వివరాలు బహిర్గతం చేయమని తెలియజేశారు.

దత్తతపై అవగాహన కల్పించేందుకు గాను ఐడిఓసి కలెక్టరేట్ నందు *దత్తత సహాయ కేంద్రాన్ని* ప్రారంభించడం జరిగింది.ప్రతి సోమవారం జరిగే ప్రజా వాణి రోజున కలెక్టరేట్ ప్రాంగణానికి వచ్చే ప్రజలకు హెల్ప్ డెస్క్ ద్వారా దత్తత ప్రక్రియకు సంబంధించిన పూర్తి సమాచారం అవసరమైన పత్రాలను ప్రభుత్వ మార్గదర్శకాలు వంటి అంశాల సమాచారం కోసం ప్రజలకు ఉపయోగపడేలా దత్తత సహాయక కేంద్రం ఉపయోగపడుతుందని తెలియజేశారు . అలాగే అంతర్జాతీయ దత్తత, విదేశీ దత్తత, బంధువుల నుంచి తీసుకున్నటువంటి దత్తత గురించి, పిల్లలను దత్తత తీసుకోవాలనే దంపతులకు సరైన విధానం నియమాలను నమోదు ప్రక్రియ గురించి వాత్సల్య పోర్టల్ www.missionvastalya.wwd.gov.in ద్వారా పిల్లల అడాప్షన్ ప్రక్రియను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని. అక్రమ దత్తతను తీసుకున్నపై కఠినమైన చర్యలు తీసుకోబడతాయని,తెలియజేశారు. తదనంతరం దత్తత పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది.
చైల్డ్ సేఫ్టీ వారోత్సవాల్లో భాగంగా (42 )ప్రశ్నలతో కూడిన వివరాలను సేకరించి (7) మంది పిల్లలకు ఈరోజు వివిధ అంశాలలో స్క్రీనింగ్ (వైద్య పరీక్షలు)నిర్వహించామన్నారు,
ఐసిడిఎస్ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే అన్ని విభాగాలు పిల్లలు వృద్దులు మహిళలు సీనియర్ సిటిజన్స్ వారికి కేటాయించిన సంక్షేమం గురించి షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించి సేవలు అందించాలన్నారు,
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ రవి రాథోడ్, జిల్లా ఇంచార్జ్ సంక్షేమ అధికారి శిరీష ,చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ డాక్టర్ నాగవాణి, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపర్డెంట్ శ్రీనివాస్, ఆర్ ఎం ఓ జగదీష్ ,బాల రక్ష భవన్ కోఆర్డినేటర్ రాజ్యలక్ష్మి, డీసీపీఓ కమలాకర్ ,బాలల సంరక్షణ అధికారులు నరేష్, వీరన్న, చైల్డ్ కోఆర్డినేటర్ వెంకటేష్ ,రమేష్ వెంకన్న , సరోజ,ఆమని కళ్యాణి,అనిల్,సాయి ,ఉపేందర్, హాజరయ్యారు.
