సామాజిక సేవా రంగంలో ముందున్న జనతా ట్రస్ట్

 

  • నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ సహకారంతో ఉపకరణాల పంపిణీ – డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి

నర్సంపేట న్యూస్ : చిన్న వ్యాపారుల జీవనోపాధిని బలోపేతం చేసే దిశగా జనతా ట్రస్ట్ వినూత్న కార్యక్రమం చేపట్టింది. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ (NECC) సహకారంతో వీధి వ్యాపారం చేసుకునే నిరుపేదలకు వ్యాపారాభివృద్ధికి అవసరమైన వస్తువులను పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో భాగంగా గుడ్లు, బ్రెడ్, ఇతర అల్పాహార పదార్థాల వ్యాపారం చేసుకునే వారికి తోపుడు బండ్లు, గొడుగులు, తూనికలు, గ్యాస్ స్టవ్‌లు, పాత్రలు తదితర సామగ్రిని ఉచితంగా అందజేశారు. నాలుగు కుటుంబ లబ్ధిదారులకు ఈ సహాయం అందింది.

ఈ సందర్భంగా జనతా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, “వీధి వ్యాపారులు సమాజంలో కీలకమైన ఆర్థిక వ్యవస్థలో భాగం. వారి స్వయం ఉపాధికి ఊతమిచ్చి, గౌరవప్రదమైన జీవనం సాగించేలా చేయడమే మా లక్ష్యం. NECC వారు గుడ్ల పరిశ్రమను అభివృద్ధి చేస్తున్నట్లే, మేము చిరు వ్యాపారులను ప్రోత్సహిస్తున్నాము” అని రానున్న రోజుల్లో నర్సంపేట నియోజకవర్గంలో 200 పైగా కుటుంబాలకు EGG cart లు ఇప్పియ్యడానికి కృషి చేస్తానని తెలియజేశారు.

NECC all india Egg cart co- ordinator శ్రీ కొర్ర రాజీవ్ మాట్లాడుతూ, “పౌల్ట్రీ రైతుల సంక్షేమంతో పాటు గుడ్ల వినియోగం పెరిగేలా చూడటం, చిన్న వ్యాపారులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించడం మా బాధ్యత. ‘My Egg, My Price, My Life’ అనే మా నినాదం రైతుకే కాకుండా వీధి వ్యాపారికీ వర్తిస్తుంది” అని అన్నారు. లబ్ధిదారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ఈ సహాయంతో తమ వ్యాపారం మెరుగుపడి కుటుంబ పోషణ సులభమవుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో దొడ్డ రవీందర్, బాదం రంజిత్, గండు నవీన్, కట్ల రామచందర్ రెడ్డి, జుర్రు రాజు , ex ఎంపీపీ రాజు, నర్సంపేట బీజేపీ పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్, నల్లవెల్లి మండల అధ్యక్షులు తడుక వినయ్ గౌడ్, నెక్కొండ మండల అధ్యక్షులు నాయిని అశోక్, జూలూరి మనీష్ గౌడ్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్చ దయాకర్, ఉపాధ్యక్షులు కొంకిస విగ్నేష్ గౌడ్, సీనియర్ నాయకులు కుంభం కోమల్ రెడ్డి, కోటి, బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి సూత్రపు సరిత, భానోత్ రాజేందర్, బానోత్ రమేష్ పట్టణ ఉపాధ్యక్షులు ఠాకూర్ విజయ్ సింగ్, కాసుల నాగేంద్రబాబు, థౌటం నిశాంత్, సామల ప్రవీణ్ ,పులిపాక అశోక్, శోభన్, చిలువేరు అన్వేష్, సామల సాయి, శివ సభ్యులు పాల్గొన్నారు.