న్యూస్ డెస్క్: దౌల్తాబాద్ మండలంలో ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని నిర్వహించిన అంబలి పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. బౌరంపేటకు చెందిన యాదగిరి అండాలు గారి జ్ఞాపకార్థంగా ఈ సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ప్రత్యేకతగా నిలిచింది.


మండల కేంద్రంలో నిర్వహించిన ఈ అంబలి జావా పంపిణీ కార్యక్రమానికి గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై సేవా భావాన్ని చాటుకున్నారు. ముఖ్యంగా ఎండలతో ఇబ్బందులు పడుతున్న వృద్ధులు, చిన్నపిల్లలకు చల్లని అంబలి అందించి ఉపశమనం కలిగించారు.
ఈ కార్యక్రమాన్ని బౌరంపేటకు చెందిన గురుమూర్తి చారి, సురేష్ చారి కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుండి వచ్చి నిర్వహించడం విశేషం. కార్యక్రమం మొత్తం మాదంశెట్టి ఉమాదేవి భద్రయ్య (మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ) పర్యవేక్షణలో సక్రమంగా కొనసాగింది.
ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో అవసరమని తెలిపారు. ఎండాకాలంలో అంబలి పంపిణీ చేయడం అనేకమందికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. నిర్వాహకుల సేవా భావాన్ని వారు అభినందించారు.
దౌల్తాబాద్ మండలంలో నిర్వహించిన ఈ అంబలి దాదాపు 800 మందికి పోయడం జరిగింది కార్యక్రమం సేవా స్పూర్తిని చాటుతూ గ్రామ ఐక్యతను మరింత బలోపేతం చేసింది.