న్యూస్ డెస్క్ : ప్రజాపాలన ప్రగతిప్రణాళిక (90 రోజుల ప్రణాళిక)లో భాగంగా బయ్యారం మండలం ఉప్పలపాడు గ్రామం మరియు బోడగుట్ట తండ ప్రాంతాల్లో భరోసా బృందం అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది.
ప్రస్తుత కాలంలో మాయమాటలు చెప్పి మహిళలు, యువతులను మోసాలకు గురిచేస్తున్న నేపథ్యంలో నేరాల నియంత్రణలో ప్రజలు కీలక పాత్ర పోషించాలని సూచించారు. జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారా నేరాలను నివారించవచ్చని వివరించారు. లింగ వివక్ష లేకుండా పిల్లల పెంపకం ఉండాలని, బాల్య వివాహాల నిర్మూలనపై దృష్టి పెట్టాలని తెలిపారు.
సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా, మహిళలపై అత్యాచారాలు, విద్యార్థులపై జరుగుతున్న అఘాయిత్యాలపై అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల వినియోగం గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. సైబర్ నేరాలపై ఫిర్యాదు చేయడానికి 1930 టోల్ ఫ్రీ నంబర్ వినియోగించాలని తెలిపారు.
తెలియని నంబర్ల నుండి మహిళలకు ఇబ్బందులు కలిగినప్పుడు లేదా ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినప్పుడు ధైర్యంగా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. భరోసా కేంద్రం విధులు, మహిళలు మరియు పిల్లలకు అందిస్తున్న సేవలు, పోక్సో చట్టంపై వివరించారు.
ఈ కార్యక్రమంలో భరోసా ఇంచార్జ్ ఎస్.ఐ వి.దీపిక, సమన్వయకర్త మరియు కౌన్సిలర్ సి.హెచ్.జ్యోష్ణ, న్యాయ సహాయకురాలు ఎస్.లహరిక, సహాయక సిబ్బంది కె.బేబీ, పి.రేణుక, ఏ.ఎన్.ఎం ఎం.పార్వతి, డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు అకౌంటెంట్ బి.రేణుక, రిసెప్షనిస్ట్ డి.మౌనిక తదితరులు పాల్గొన్నారు.
