డాక్టర్ అనితా రెడ్డి
అనురాగ్ సొసైటీ చైర్మన్
సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ కోర్టు మెంబర్
న్యూస్ డెస్క్ : అనురాగ్ హెల్పింగ్ సొసైటీ మరియు మెడికవర్ హాస్పిటల్స్, వరంగల్ ఆధ్వర్యంలో లార్డ్ వృద్ధాశ్రమం, షెల్టర్ హోమ్ ఫర్ షెల్టర్ లెస్ పలివెల్పుల రోడ్డు భీమారం హనుమకొండలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ వైద్య శిబిరంలో సుమారు 100 మందికి పైగా వృద్ధులకు, అనాథలకు ఉచిత వైద్య సేవలు అందించ బడింది వైద్య శిబిరంలో భాగంగా వృద్ధులకు ఉచితంగా బీపీ, ఈసీజి, షుగర్, గుండె సంబంధిత పరీక్షలు, కీళ్ల నొప్పుల పరీక్షలు నిర్వహించడంతో పాటు, అవసరమైన వారికి మెడికవర్ హాస్పిటల్స్, వరంగల్‌లో ఉపయోగించుకునే ఉచిత ఓపీ కూపన్ కార్డులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ అనితా రెడ్డి, సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ కోర్టు మెంబర్ హనుమకొండ, హాజరై శిబిరాన్ని ప్రారంభించారు వృద్ధులకు అందిస్తున్న సేవలను అభినందించారు.

ఈ సందర్భంగా డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ
ప్రతి కార్పొరేట్ సంస్థలు ( సి, ఎస్. ఆర్) కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బిలిటీ కింద పేద ప్రజలకు, సమాజానికి ఉచిత సేవలు అందించాలని అన్నారు, అనాధ వృద్ధులకు ఉచిత వైద్య సేవలు అందించడానికి ముందుకు వచ్చిన మెడికవర్ హాస్పిటల్ నిర్వాహకులు అందరికి స్పూర్తిదాయకంగా నిలిచారని డాక్టర్ అనితా రెడ్డి అభినందించారు, ఈ శిబిరంలో డాక్టర్ రత్న కార్తీక్ రెడ్డి ,కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ మెడికవర్ హాస్పిటల్స్, వరంగల్ మరియు వైద్య బృందం పాల్గొని ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి. వారి సేవలు అందించారు. మెడికవర్ హాస్పిటల్స్, వరంగల్ వైద్యులు మాట్లాడుతూ వృద్ధులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ ఇలాంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో కూడా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో వృద్ధులకు చేరువగా ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు మరింతగా నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్స్ వైద్య బృందం, సిబ్బంది మరియు, లార్డ్ వృద్ధ ఆశ్రమ నిర్వాహకులు నాగరాని నరేష్,మమత, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
