న్యూస్ డెస్క్ : సిద్దిపేట జిల్లా పద్మశాలి సంఘం కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు డాక్టర్ కస్తూరి సతీష్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సహకార కార్పొరేషన్ చైర్మన్‌గా ఎన్నికైన సిద్దిపేటకు చెందిన పద్మశాలి ముద్దుబిడ్డ గూడూరు శ్రీనివాస్‌ను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ గూడూరు శ్రీనివాస్ రాష్ట్ర స్థాయిలో పద్మశాలి సమాజానికి మరింత సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఆయన నియామకం సిద్దిపేట జిల్లా పద్మశాలి వర్గాలకు గర్వకారణమని పేర్కొన్నారు. పద్మశాలి సంక్షేమం, చేనేత కార్మికుల అభివృద్ధికి ఆయన కృషి చేయాలని శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు జోగు బిక్షపతి, జిల్లా ప్రచార కార్యదర్శి ముదిగొండ శ్రీనివాస్, పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు కాముని రాజేశం, సిరిగాది బాలరాజ్, పెద్ది శ్రీనివాస్, జి.కొండ మహేష్, రాజేంద్రప్రసాద్, ఇందిరానగర్ పద్మశాలి సంఘం అధ్యక్షులు సామల విట్టలు, సిహెచ్ వెంకన్న, మాదాసు సత్యం, శ్రీనగర్ పద్మశాలి సంఘం అధ్యక్షులు దొంతుల శ్రీధర్, తాళ్ల విట్టలు, దేశభక్తిని వైకుంఠం, హుస్నాబాద్ పద్మశాలి సంఘం నేతలు గాజుల భగవాన్ నేత, చింతకింది శ్రీనివాస్, మామిడాల బాలకృష్ణ, సిరిసిల్ల బాలకిషన్, అరగొండ మల్లేశం తదితర పద్మశాలి ప్రముఖులు, పెద్దలు పాల్గొన్నారు.

Avatar photo

By Editor

Digital journalist and media professional delivering accurate breaking news, impactful storytelling, and engaging content across modern platforms.