తెలంగాణ ఎక్స్ ప్రెస్, జూన్ 24 : శేరిలింగంపల్లి వార్డు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ఇందిర మహిళా శక్తి చీరాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే, పిఏసీ చైర్మన్ అరేకపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు హమీద్ పటేల్, రాగం నాగేందర్ యాదవ్ , నార్నె శ్రీనివాస్ రావు , యాదవ కార్పొరేషన్ చైర్మన్ రఘునాథ్ యాదవ్, శేరిలింగంపల్లి జోన్ డిప్యూటీ కమిషనర్ శ్రీమతి సేవా ఇస్లావత్ , ప్రాజెక్ట్ ఆఫీసర్ స్వాతి, సీఓ పద్మ, సీఓ శ్రీకాంత్ తదితర అధికారులు, డ్వాక్రా సంఘ మహిళా సభ్యులు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళా స్వయం సహాయక సంఘాల మహిళలకు చీరలను పంపిణీ చేశారు. మహిళల సంక్షేమం, సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రతి అర్హత కలిగిన మహిళకు చేరేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.