తెలంగాణ ఎక్స్ ప్రెస్, జూన్ 24 : శంషిగూడ డివిజన్ పరిధిలోని ఆశ నగర్ కాలనీ హైటెన్షన్ రోడ్డులో కోటి రూపాయల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శేరిలింగంపల్లి శాసనసభ్యులు, పి.ఎ.సి చైర్మన్ అరేకపూడి గాంధీ సహకారంతో డివిజన్ లో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. ఆశా నగర్ హైటెన్షన్ లైన్ లో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణపనులను నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడకుండా యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. రోడ్డును మంచిగా లెవెలింగ్ చేసి వర్షపు నీరు నిలిచిపోవడం వంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో నిర్మాణపనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో గోపాల్, లింగం, నాగేష్ గౌడ్, సత్తయ్య, రమేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.