• విలేఖరి ప్రకాష్ పై జరిగిన దాడిని ఖండించిన బిజినపల్లి మండల విలేకరులు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ : బిజినపల్లి మండల కేంద్రంలోని విలేకరి ప్రకాష్ పై జరిగిన దాడిని మండల జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం మండల తాసిల్దార్ మునీరుద్దీన్ కు వినతి పత్రం అందజేశారు. మంగళవారం పాలెం గ్రామంలో అంబేద్కర్ చౌరస్తా దగ్గర టీ తాగుతున్న సమయంలో ప్రకాష్ పై కొందరు వ్యక్తులు ఒక మహిళ చేత కావాలని దాడి చేయించారని ఆరోపించారు. అంతేకాకుండా ఈ ఘటన సంబంధించిన వీడియోలు సామాజిక మధ్యమాలలో ప్రచారంచేసి మరింత అవమానపరిచే విధంగా ప్రయత్నించారాని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో విలేకరులపై దాడులు చేయడం అనుచితమని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విలేకరులు కరిగల్ల సుదర్శన్ . నరసింహ. మహేష్ ,పృద్వి రాజ్, కిషోర్, మాసయ్య, మధు, రవితేజ, శ్రావణ్, బంగారయ్య తదితరులు పాల్గొన్నారు.