తెలంగాణ ఎక్స్ ప్రెస్, 25 జూన్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని 6వ వార్డుల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ మహోత్సవాన్ని డా. కుచుకూల రాజేశ్ రెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగ ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించారని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు,మున్సిపాలిటీ చైర్మన్ తీగల సునేంద్ర ,టౌన్ ప్రెసిడెంట్ జక్కా రాజు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్ , కౌన్సిలర్స్ శ్రీను, శంకర్ , పి.రాజేశ్వరి తదితరులు నాయకులు పాల్గొన్నారు.
