తెలంగాణ ఎక్స్ ప్రెస్, జూన్ 24 : శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ వార్డు కార్యాలయం ఆవరణలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాలకు చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పిఏసీ ఛైర్మెన్, శాసనసభ్యులు అరెకపూడి గాంధీ, యాదవ కార్పొరేషన్ చైర్మన్ రఘునాథ్ యాదవ్, కార్పొరేటర్ హమీద్ పటేల్ , కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్ రావుతో కలిసి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ద్వాక్రా మహిళలకు చీరలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మహిళా సంక్షేమం, ఆర్థిక స్వావలంబనకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని ఇందిరమ్మ చీరల పథకం ద్వారా పేద మహిళలకు ఆర్థిక భారం తగ్గించడమే లక్ష్యమని అన్నారు. మహిళలే సమాజానికి వెన్నెముక అని, ప్రతి మహిళకు గౌరవం, రక్షణ, అభివృద్ధి కల్పించడమే తమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ గౌరవ అధ్యక్షులు వీరేశం గౌడ్, మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, సీనియర్ నాయకులు కే రాంచందర్, సీఏంసీ డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ స్వాతి, కమ్యూనిటీ ఆర్గానిజర్ శ్రీకాంత్, రమా, పద్మ, వెంకట్ రావు, గఫుర్, వార్డు మెంబెర్స్ శ్రీకళా, కవిత, పర్వీన్ బేగం ,ద్వాక్రా మహిళా సంఘ అధ్యక్షురాళ్లు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
