పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన పాఠశాల టాపర్లను వేలేరు మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేకంగా సన్మానం

న్యూస్ డెస్క్ : ఇటీవల విడుదలైన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో వేలేరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. పాఠశాలకు చెందిన విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించి గ్రామానికి, పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు.

ప్రథమ స్థానం: మురావత్ దివ్య
ద్వితీయ స్థానం: మండల తేజస్వి
తృతీయ స్థానం: జన్నారపు చంద్రిక

సద్వినియోగం చేసుకుంటేనే సక్సెస్: సర్పంచ్ బిల్లా యాదగిరి
వేలేరు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు మరియు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి విద్యార్థులకు శాలువాలు కప్పి, జ్ఞాపికలను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులను కల్పిస్తోంది. సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవడం వల్లే విద్యార్థులు ఈ స్థాయి విజయాన్ని అందుకున్నారు. వంద శాతం ఫలితాలు సాధించినందుకు ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సన్మాన కార్యక్రమంలో వేలేరు మేజర్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ శ్రీకర్, గ్రామ పంచాయతీ కార్యదర్శి సంపత్ కుమార్ పాల్గొన్నారు. వీరితో పాటు వార్డు సభ్యులు సురేష్, సునీల్, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు గ్రామ పెద్దలు పాల్గొని విద్యార్థుల భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలియజేశారు.