“గాంధీ భవన్లో ఎమ్మెల్యే నాగరాజు సమక్షంలో మేడిశెట్టి రాములుకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్“

న్యూస్ డెస్క్: వరంగల్ జిల్లా పర్వతగిరి మండల మాజీ జెడ్పిటిసి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రధాన అనుచరుడిగా ఎన్నో ఏండ్లుగా ప్రజల్లో సేవలందించిన మేడిశెట్టి రాములు నేడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వర్ధన్నపేట నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై హైదరాబాద్లోని గాంధీ భవన్లో ఈ చేరిక కార్యక్రమం జరిగింది.
గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు సమక్షంలో, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మేడిశెట్టి రాములుకి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ – అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని అన్నారు. గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.
వర్ధన్నపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయని, అదే విశ్వాసం ఇతర పార్టీలకు చెందిన కీలక నాయకులను కూడా కాంగ్రెస్ వైపు ఆకర్షిస్తోందని పేర్కొన్నారు. మాజీ జెడ్పిటిసి మేడిశెట్టి రాములు వంటి అనుభవజ్ఞులైన నాయకులు పార్టీలో చేరడం ద్వారా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ, వర్ధన్నపేట నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తున్నాయని అన్నారు. ప్రజల ఆశయాలను నెరవేర్చడం, ప్రతి గ్రామం – ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఫలాలు చేరేలా చేయడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ప్రజా సేవే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. పేదల గూడు–నీడ కల, రైతు సంక్షేమం, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాల్లో ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని అన్నారు…
పర్వతగిరి మండలానికి చెందిన మాజీ జెడ్పిటిసి మేడిశెట్టి రాములు కాంగ్రెస్ పార్టీలో చేరడం హర్షణీయమని, ఆయనకు పార్టీ సిద్ధాంతాలపై ఉన్న నమ్మకం మరియు ప్రజా సేవ పట్ల ఉన్న నిబద్ధత పార్టీకి మరింత బలం చేకూరుస్తుందని చెప్పారు. ఎన్నో ఏండ్లుగా ప్రజల మధ్య పనిచేసిన అనుభవం ఉన్న నాయకులు పార్టీలో చేరడం ద్వారా కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గ అభివృద్ధి కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం అందరం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ జెండాను ప్రతి గ్రామంలో మరింత ఎగురవేయాలని, ప్రజల ఆశీర్వాదాలతో అభివృద్ధి పథంలో ముందుకు సాగుదామని అన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ ఆయుబ్, టిపిసిసి లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, జిల్లా నాయకులు పిన్నింటి అనిల్ రావు, జాటోత్ శ్రీనివాస్ నాయక్, కరాటే ప్రభాకర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.
