• డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి, బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి
ప్రధాని మోదీ మే 10, 2026న పర్యటన సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో మధ్యాహ్నం 3:00 గంటలకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ
న్యూస్ డెస్క్ : భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మే 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి పిలుపునిచ్చారు. నర్సంపేట బీజేపీ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రధానమంత్రి Narendra Modi తెలంగాణ పర్యటనలో భాగంగా మే 10, 2026న మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ సభకు కేంద్ర హోంమంత్రి Amit Shah, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, కేంద్ర మంత్రులు, రాష్ట్ర బీజేపీ నాయకులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను ఆరు గ్యారెంటీల పేరుతో మోసం చేసిందని, రైతులు, మహిళలు, నిరుద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారని విమర్శించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లుపై కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలనే లక్ష్యంతో బీజేపీ బలమైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందని అన్నారు.
నర్సంపేట నియోజకవర్గం నుంచి మహిళలు, యువత, రైతులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పరేడ్ గ్రౌండ్స్‌కు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వడ్డేపల్లి నరసింహ రాములు, జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం ఆంజనేయులు, పార్లమెంట్ కో-కన్వీనర్ కట్ల రామచంద్రారెడ్డి, బీజేపీ నాయకులు జూలూరి మనీష్ గౌడ్, వనపర్తి మల్లయ్య, కోమల్ రెడ్డి, పాలడుగుల జీవన్, నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్, నల్లబెల్లి మండల అధ్యక్షులు తడక వినయ్, నర్సంపేట రూరల్ అధ్యక్షులు తనుగుల అంబేద్కర్, దుగ్గొండి మండల అధ్యక్షులు నేదురు రాజేందర్, ఖానాపూర్ మండల అధ్యక్షులు రాదారపు అశోక్, చెన్నారావుపేట మండల అధ్యక్షులు శేఖర్, జిల్లా కౌన్సిల్ సభ్యులు దుంక దువ్వ రంజిత్, మాజీ ఎంపీటీసీ భాషా బోయిన రాజు, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్చ దయాకర్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు కొంకిసా విఘ్నేష్ గౌడ్, మహిళా నాయకురాలు వసంతకుమారి తదితరులు పాల్గొన్నారు.
