స్నేహపూర్వక వాతావరణంలో ఉత్సాహంగా వేడుకలు

న్యూస్ డెస్క్ : తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీరమోహన్ జన్మదిన వేడుకలు గురువారం 40వ డివిజన్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి చేనేత ఐక్య వేదిక నాయకులు, పద్మశాలి కుల బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా రాపోలు వీరమోహన్ మాట్లాడుతూ తన జన్మదినాన్ని పురస్కరించుకొని ఆశీస్సులు, అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. సమాజ సేవలో ఎల్లప్పుడూ ప్రజల అభిమానానికి తగిన విధంగా సేవ చేస్తానని పేర్కొన్నారు. తమపై ఇలాగే ఆశీస్సులు, ఆదరణ కొనసాగించాలని కోరారు.

జరిగిన కార్యక్రమంలో తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు దాసరి సుధాకర్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రాష్ట్ర మీడియా కార్యదర్శి రాంపెల్లి లింగమూర్తి, రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు మంత్రి కమలాకర్ నేత, గుడిమల్ల రాజు, కందగట్ల వెంకటేశ్వర్లు, జడల శ్రీరామ్ మూర్తి, జడల శ్రీనివాస్, దాసరి రాము, పద్మశాలి కుల బంధువులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని రాపోలు వీరమోహన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.