న్యూస్ డెస్క్ : కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) వైస్ ప్రెసిడెంట్గా సబ్బని కృష్ణహరి నియమితులయ్యారు. కామారెడ్డి పట్టణంలోని క్రిస్టల్ ఫంక్షన్ హాల్లో డీసీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ బాధ్యతలను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ (PCC) చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా కృష్ణహరి తన నియామక పత్రాన్ని (Appointment Order Copy) అందుకున్నారు.
ఈ సందర్భంగా సబ్బని కృష్ణహరి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించినందుకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ నాయకులు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, ప్రభుత్వ విప్ మహ్మద్ అలీ షబ్బీర్, మరియు డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు (మల్లికార్జున్)లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి, కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి శ్రేణులతో కలిసి అంకితభావంతో పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
