తెలంగాణ ఎక్సప్రెస్ న్యూస్ : మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం చిన్నగూడూర్ మండలంలోని మన్నెగూడెం గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త దుబ్బాక లక్ష్మారెడ్డి ఇటీవల మరణించగా నేడు మరిపెడ బంగ్లాలోని లక్ష్మారెడ్డి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన వారి దశదినకర్మ కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా దుబ్బాక లక్ష్మారెడ్డి గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓడిసిఎంఎస్ మాజీ చైర్మన్ కుడితి మహేందర్ రెడ్డి కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి రామసహాయం సత్యనారాయణ రెడ్డి కొంపల్లి వేణుగోపాల్ రెడ్డి నరేష్ రెడ్డి వల్లూరి చెన్నారెడ్డి బొడ శ్రీను నాయక్ బొమ్మకంటి వెంకట్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
