తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన అరుణ (తల్లి & పిల్లల) హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా హాస్పిటల్ ను ప్రారంభించి వైద్య సేవలు అందించనున్న డాక్టర్ అరుణ డాక్టర్ సాగర్ గార్లకు పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ తల్లి-శిశు ఆరోగ్య సేవలు సమాజానికి ఎంతో కీలకమని అత్యాధునిక సౌకర్యాలతో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ హాస్పిటల్ మహబూబాబాద్ జిల్లా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే కేంద్రంగా ఎదగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రవీందర్ రావు మాజీ ఎంపీ మాలోత్ కవిత మాజీ ఎమ్మెల్యే డి ఎస్ రెడ్యానాయక్ మహబూ బాబాద్ మాజీ జడ్పీ చైర్మన్ కుమారి అంగోత్ బిందు మరియు వైద్యులు పార్టీ నాయకులు అభిమానులు మరియు స్థానికులు పాల్గొన్నారు.
