చింతల్ బస్తీలో జరుగబోయే హిందూ ధర్మ సమ్మేళన కార్యక్రమం విజయవంతం చేద్దాం!
న్యూస్ డెస్క్ : చింతల్ బస్తీలోని శ్రీ భక్త హనుమాన్ దేవస్థానం ప్రాంగణంలో రేపు అనగా 2 మే, సాయంత్రం 6 గంటలకు నిర్వహిస్తున్నటు వంటి హిందూ ధర్మ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీశ్రీశ్రీ సద్గురు మహాదేవ్ స్వామీజీ, మహాదేవ్ ధర్మపీఠం, గుడిమెట్. అలాగే వక్తలు శ్రీ పాశం రాజిరెడ్డి గారు మహానగర్ ప్రచార ప్రాముఖ్, శ్రీమతి పోకల జ్యోతిర్మయి వరంగల్ విభాగ్ కార్యావాహిక గారు విచ్చేయుచున్నారు.
కావున ఈ యొక్క హిందూ సమ్మేళన కార్యక్రమానికి డివిజన్ పరిధిలోని ప్రతీ హిందూ సోదర, సోదరీమణులు విచ్చేయవలసిందిగా కోరుకుంటున్నాము. వక్తలు మన హిందూ సమాజ సంస్కృతి, సంప్రదాయాలు మరియు భారత దేశ విశిష్టతను, అలాగే దేశ భక్తుల గురించి తెలియజేయనున్నారు. హిందూ ధర్మ సమ్మేళనంలో సాంస్కృతిక సాంప్రదాయ కళ కార్యక్రమాలు నిర్వహించడం, కార్యక్రమ అనంతరం మహిళలకు పూజ చేసినటువంటి గాజులు, కుంకుమ అందజేయడం, అలాగే మహా అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించనున్నారని చింతల్ బస్తీ హిందూ ధర్మ సమ్మేళనం కార్యక్రమ అధ్యక్షులు బొల్లోజు ప్రభాకర్ గారు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ వరంగల్ జిల్లా ఐటీ ఇంఛార్జి ఆడెపు వెంకటేష్ గారు, డివిజన్ BRS అధ్యక్షులు వేల్పుగొండ యాకన్న, మానుపాటి ఎల్లయ్య, డింగరి వెంకటాచార్యులు, వెంపటి రాజేష్, అంబటి అనిల్, గుండేటి రాజు, అంబటి అంబికా, ఆకుల ధనలక్ష్మి,పి రజిని, అంబటి శ్రీలత, మంద శ్రీలత గారు పాల్గొనడం జరిగింది.
