ఇందుప్రియాల్ గ్రామ సర్పంచ్ వీరమ్మ స్వాతి–స్వామి ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలతో మట్టాడి సమయపాలన పాటించాలని సూచన

న్యూస్ డెస్క్ : దౌల్తాబాద్ మండలంలోని ఇందుప్రియాల్ గ్రామంలో గ్రామ సర్పంచ్ వీరమ్మ స్వాతి–స్వామి ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కూలీలకు సమయపాలన అత్యంత ముఖ్యమని ఆమె తెలిపారు.

ఉపాధి హామీ పనులు సక్రమంగా జరిగేందుకు కూలీలు నిర్దేశిత సమయానికి పనులకు హాజరుకావాలని సూచించారు. పనుల నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా బాధ్యతగా వ్యవహరించాలని ఆమె కోరారు.
కూలీల కోసమే ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకుని కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకోవాలని సర్పంచ్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ పరశురామ్, సీనియర్ మేట్ హోతరాజు కృష్ణయ్య, బొంపల్లి కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ ఉపసర్పంచ్ కడారి మల్లేశం కూడా ఈ సమావేశంలో పాల్గొని కూలీలకు పలు సూచనలు చేశారు.