న్యూస్ డెస్క్ : పేదలకు సొంతింటి కలను నిజం చేస్తూ “ఇందిరమ్మ ఇల్లు” పథకం ఆశాకిరణంగా నిలుస్తోందని దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. గూడు లేని పేదవాడికి ఆశ్రయం కల్పిస్తూ, కన్నీటి గుడిసెల స్థానంలో చిరునవ్వులు నింపే భవనాలుగా ఇవి నిలుస్తున్నాయని అన్నారు.
రాయపోల్ మండలం అనాజీపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు మిరుదొడ్డి మనోజ్, శ్రీకాంత్‌ల నూతన గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేద కుటుంబాలకు ఇల్లు కలగడం అనేది కేవలం నివాసమే కాదు, వారి ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. “కూటికంటే ముందు గూడు కావాలి” అన్న ఆశను నెరవేర్చే గొప్ప పథకం ఇదని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ఐలాపురం కనకయ్య యాదవ్, వైస్ చైర్మన్ మద్దెల స్వామి, మండల పార్టీ అధ్యక్షుడు తప్పేట సుధాకర్, యువ నాయకులు జాల దుర్గాప్రసాద్ ముదిరాజ్, ఏఎంసీ డైరెక్టర్లు ఇప్ప మల్లేశం, బాకీ మల్లేశం, పట్నం యాదగిరి, జిల్లా యూత్ జనరల్ సెక్రటరీ అనిల్ గౌడ్, మండల కోఆర్డినేటర్ గుంటి నర్సింలు, రాచకొండ యాదగిరి, రాచకొండ కరుణాకర్, నర్సింలు, కిష్టయ్య, రాయపోల్ స్వామి, చంద్రశేఖర్, జనార్దన్ రెడ్డి, గ్రామ అధ్యక్షుడు కృష్ణ, వార్డ్ సభ్యుడు కిషన్, గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు దుర్గుల నవీన్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.
