• భక్తిశ్రద్ధలతో కట్ట మైసమ్మ తల్లి ప్రతిష్ఠ
• బొడ్రాయి ఉత్సవాల్లో ఈగ మల్లేశం ప్రత్యేక పూజలు
హాజరైన కేంద్ర ఖాదీ బోర్డు మాజీ డైరెక్టర్ ఈగ మల్లేశం
• ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: కేంద్ర ఖాదీ బోర్డు పూర్వ డైరెక్టర్ ఆకాంక్ష
న్యూస్ డెస్క్ : హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం గర్మిళ్ళపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ భూదేవి, నాభిశిల, శీతలాదేవి బొడ్రాయి ప్రతిష్ఠ మరియు శివాలయ ధ్వజస్తంభారోహణ మహోత్సవాల్లో కేంద్ర ఖాదీ మరియు చిన్న పరిశ్రమల బోర్డు పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉత్సవాల ముగింపు రోజైన బుధవారం ఆయన ఆలయాన్ని సందర్శించి, కట్ట మైసమ్మ తల్లి ప్రతిష్ఠా కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గ్రామస్తులను ఉద్దేశించి ఈగ మల్లేశం మాట్లాడుతూ.. గ్రామాల్లో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం వల్ల గ్రామ ఐక్యత పెరుగుతుందని, భగవంతుని కృపతో గ్రామం సుభిక్షంగా మారుతుందని పేర్కొన్నారు. ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, పాడిపంటలతో గ్రామం విలసిల్లాలని తాను మనస్ఫూర్తిగా దైవాన్ని వేడుకున్నట్లు తెలిపారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనడం, ఇంతటి భారీ స్థాయిలో ఉత్సవాలు నిర్వహించడంపై ఆయన గ్రామ కమిటీని అభినందించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గబ్బెట రోజా-అశోక్, ఉప సర్పంచ్ ఎల్లా గౌడ్, ప్రముఖులు చెరుకు లక్ష్మీకాంతమ్మ, చెన్న గౌరీ లక్ష్మి, గంకిడి వెంకటేశ్వర్ రెడ్డి, బీరం దేవేందర్ రెడ్డి, పోరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, గండి రమేష్, రాజరపు ఎల్లయ్య, సార్ల సురేష్, ఎల్. వెంకట్ రెడ్డి, మారెపల్లి శ్రీనివాస్ రెడ్డి మరియు ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
