తెలంగాణ ఎక్సప్రెస్ న్యూస్ : మహబూబాబాద్ జిల్లాలో అక్రిడిటేషన్ కలిగిన ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు 2026–27 విద్యా సంవత్సరానికి ప్రైవేట్ గుర్తింపు పొందిన అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో 100 శాతం ఫీజు రాయితీ కల్పిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి ఎ. సత్యనారాయణ మూర్తి జారీ చేసిన ఉత్తర్వుల ను మహబూబా బాద్ జిల్లా ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ (TWJA) అధ్యక్షుడు బానోత్ లక్ష్మణ్ నాయక్ హర్షం వ్యక్తం చేశారు ఈ నిర్ణయం వెనుక సహకరించిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష గారికి ఉత్తర్వులు జారీ చేసిన డీఈఓ సత్యనారాయణమూర్తికి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ (TWJA) తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ-IJU) టీయూడబ్ల్యూజేహెచ్-143 జిల్లా కమిటీల వినతిని సానుకూలంగా పరిశీలించి ఈ ఉత్తర్వులు జారీ చేయడం అభినందనీయమని బానోత్ లక్ష్మణ్ నాయక్ పేర్కొన్నారు జర్నలిస్టుల కుటుంబాలపై విద్యా భారం తగ్గించే దిశగా ఇది ఒక కీలకమైన నిర్ణయమని అన్నారు అయితే జారీ చేసిన ఉత్తర్వులు కేవలం ఉత్తర్వులకే పరిమితం కాకుండా జిల్లాలోని అన్ని ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో అమలయ్యేలా జిల్లా విద్యాశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆయన కోరారు ముఖ్యంగా జిల్లా విద్యాశాఖ అధికారి జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు కరస్పాండెంట్లు ప్రిన్సిపాళ్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్‌ను తూచా తప్పకుండా అమలు చేసేలా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు అక్రిడిటేషన్ కలిగిన ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు 100 శాతం ఫీజు రాయితీ ఎలాంటి ఆటంకాలు లేకుండా అందేలా జిల్లా విద్యాశాఖ నిరంతర పర్యవేక్షణ చేపట్టి ప్రతి ప్రైవేట్ పాఠశాలలో ఈ ఉత్తర్వులు అమలవుతున్నాయా లేదా అన్న విషయాన్ని సమీక్షించాలని బానోత్ లక్ష్మణ్ నాయక్ కోరారు ప్రతి అర్హులైన ట్రైబల్ జర్నలిస్టు కుటుంబానికి చేరేలా జిల్లా యంత్రాంగం చర్యలు వేగవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.