• జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. రవి రాథోడ్

న్యూస్ డెస్క్ : మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ లోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. రవి రాథోడ్ అధ్యక్షతన ఆర్‌బీఎస్‌కే (RBSK) సిబ్బందితో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం కింద మహిళా శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న “బాల భరోసా” కార్యక్రమం అమలు పై సమగ్రంగా చర్చించారు ఈ బాల భరోసా కార్యక్రమం 27 ఏప్రిల్ 2026 నుండి ప్రారంభమై అంగన్‌వాడీ కేంద్రాలకు హాజరవుతున్న ప్రీ-స్కూల్ పిల్లల ఆరోగ్య అభివృద్ధిని మెరుగుపరచడం లక్ష్యంగా చేపట్టబడింది మొదటగా మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది అంగన్‌వాడీ కేంద్రాలలో పిల్లలను ప్రాథమికంగా పరిశీలించి అభివృద్ధి లోపాలు (Developmental abnormalities) ఉన్న పిల్లలను గుర్తిస్తున్నారు అలాంటి పిల్లలను ఆర్‌బీఎస్‌కే బృందాలకు రిఫర్ చేయగా ఆర్‌బీఎస్‌కే వైద్య బృందాలు మరింత సవివరంగా పరీక్షలు నిర్వహించి అవసరమైతే ఉన్నత వైద్య కేంద్రాలకు రిఫర్ చేస్తున్నారు.

ఈ విధంగా చిన్నపిల్లల్లో ఉన్న ఆరోగ్య సమస్యలను తొందరగా గుర్తించి సమయానికి చికిత్స అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అని డా. రవి తెలిపారు ఈ సమావేశంలో ఆర్‌బీఎస్‌కే సిబ్బందికి అవసరమైన సూచనలు మార్గదర్శకాలు ఇవ్వబడినవి అన్ని బృందాలు సమన్వయంతో పనిచేసి, అంగన్‌వాడీ పిల్లల ఆరోగ్య పరిరక్షణలో మెరుగైన ఫలితాలు సాధించాలని డీఎంహెచ్ఓ సూచించారు ఈ కార్యక్రమం లో జిల్లా ఇమ్యూనిజేషన్ అధికారి డాక్టర్ లక్ష్మి నారాయణ జిల్లా డిప్యూటీ మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్ హెచ్ ఈ ఓ కే ఎల్ యన్ స్వామి ఆర్‌బీఎస్‌కే వైద్యాధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.