న్యూస్ డెస్క్ : తూప్రాన్ పట్టణ కేంద్రంలోని “వనం రిసార్ట్”లో చేగుంట మండల మైనారిటీ నాయకులు సాబేర్ తమ్ముడి రిసెప్షన్ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వేడుకలో తొగుట మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ రెడ్డి (అమర్), చేగుంట మార్కెట్ కమిటీ చైర్మన్ తాడెం వెంగళరావు, ఉమ్మడి దౌల్తాబాద్-రాయపోల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మద్దెల స్వామి, మాజీ సర్పంచ్ కాశబోయిన భాస్కర్, చేగుంట మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, అయిత పరంజ్యోతి, రఫీ, కన్యారం సతీష్, సోలిపేట ప్రసాద్ రెడ్డి, కోమటిరెడ్డి పద్మారెడ్డి, మల్లా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
