తెలంగాణ ఎక్స్ ప్రెస్, 30 జూన్: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రం శ్రీపురం గ్రామానికి చెందిన డి. రాజు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో బాధిత కుటుంబ సభ్యులు నాగర్‌కర్నూల్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ని కలిసి తమ పరిస్థితిని వివరించి, సహాయం చేయాల్సిందిగా కోరారు. వారి విజ్ఞప్తిపై ఎమ్మెల్యే తక్షణమే స్పందించారు.

ముఖ్యమంత్రి సహాయ నిధి సిఎం ఆర్ ఎఫ్‌ నుండి రూ. 75,000.00 (డెబ్బై ఐదు వేల రూపాయలు) విలువైన లెటర్ ఆఫ్ క్రెడిట్ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా రాజు నిమ్స్ ఆస్పత్రిలో మంచి వైద్యం చేయించుకుని, త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఎమ్మెల్యే తక్షణ స్పందనపై బాధిత కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ, కృతజ్ఞతలు తెలిపారు.