తెలంగాణ ఎక్స్ ప్రెస్, శేరిలింగంపల్లి: ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని పీజేఆర్ నగర్ కాలనీలలో డ్రైనేజీ మరియు మంజీరా వాటర్ కు సంబంధించిన సమస్యలు ఉన్నాయని కాలనీవాసులు డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ కాలనీలలో పాదయాత్ర చేసి సమస్యలను6 పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతు, కాలనీలో డ్రైనేజ్ లైన్ కొన్నిచోట్ల జామ్ అయ్యి ఇబ్బందిగా ఉందని వెంటనే సిల్ట్ ను శుభ్రంచేసి సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. అదేవిధంగా డ్యామేజ్ అయ్యిన మ్యాన్ హోల్స్ మూతలను కొత్తవి మార్చేలా చర్యలు తీసుకుంటామని తెలియచేశారు. కాలనీలో రెండు బ్లాక్ లకు మంజీరా వాటర్ ప్రెషర్ రావడంలేదని కాలనీవాసులు తెలుపగా సమస్యను శేరిలింగంపల్లి శాసనసభ్యులు పిఎసి చైర్మన్ అరెకపూడి గాంధీ దృష్టికి జలమండలి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గోపాల్, పాండుగౌడ్, యాదగిరి, రాజుగౌడ్, అనిత, లింగమ్మ, రోహిణి, అంజమ్మ, శిరీష, కావ్య, మల్లీశ్వరి, వెంకటేష్, రాజు, నరసింహ, శ్రీనివాస్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
