• రోడ్డు నాణ్యతను పరిశీలిస్తున్న- వేణుగోపాల్ రెడ్డి
తెలంగాణ ఎక్స్ ప్రెస్, మిర్యాలగూడ టౌన్: మిర్యాలగూడ మున్సిపాలిటీ 6వార్డ్ ఇందిరమ్మ కాలనీ లో లేఔట్ త్రీ మరియు ఫోర్ లో సిసి రోడ్లు లేక వర్షాకాలం వస్తే అనేక ఇబ్బందులు పడుతూ పిచ్చి మొక్కలు మొలిచి పాములు విషపురుగులు తిరుగుతున్నాయని నూతనంగా గెలిచిన కౌన్సిలర్ అశోక్ గారిని వార్డు ప్రజలు కలిసి గత పది సంవత్సరాల నుంచి రోడ్డు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని తెలియజేయగానే వేణుగోపాల్ రెడ్డి సహకారంతో ఎమ్మెల్యే గారిని కలిసి మున్సిపల్ చైర్మన్ గారికి తెలియజేయగానే వెంటనే స్పందించి 600 వందల మీటర్ల సిసి రోడ్డు మంజూరు చేయించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రోడ్డు నాణ్యతను పరిశీలించి అలాగే త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులో తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డ్ అధ్యక్షుడు అంబటి వెంకటకృష్ణ, యూత్ అసెంబ్లీ కన్వీనర్ నాగు నాయక్ పల్లె భాస్కర్, దోమలపల్లి సైదులు, గుమ్మడవెల్లి అంజి, ఎస్కే మస్తాన్ మరియు వార్డ్ నాయకులు పాల్గొన్నారు.
