తెలంగాణ ఎక్స్ ప్రెస్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ గ్రామంలోని బూత్‌లో నిర్వహిస్తున్న SIR కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ హసీనాబాను అక్బర్ ఖాన్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఓటరు నమోదు, సవరణల ప్రక్రియను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడారు.
ఓటరు జాబితాలో ప్రతి అర్హులైన ఓటరు పేరు నమోదు అయ్యేలా, ఎలాంటి పొరపాట్లు జరగకుండా అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. గ్రామ ప్రజలు కూడా SIR కార్యక్రమానికి పూర్తి సహకారం అందించి, తమ ఓటరు వివరాలను పరిశీలించి అవసరమైన సవరణలు చేయించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గడ్డం స్వామి, మహమ్మద్ నయీముద్దీన్ , మహమ్మద్ బిన్ అలీ, కొండపల్లి రాములు, పడాల మొగిలి, చీర్లవంచ చంద్రశేఖర్, నల్ల బుగ్గ సమ్మయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు , BLO సునీత, ప్రవళిక, శ్రీశైలం, రూహి, శ్యామల మరియు బి ఎల్ ఏ లు అమీర్ ఖాన్, మేసినేని రవిచంద్ర ,ధాగం సంతు, మహమ్మద్ నయుముద్దీన్ సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.