సూర్యాపేట: సూర్యాపేట చేనేత పారిశ్రామిక సహకార సంఘం నూతన కమిటీ సూర్యాపేట పట్టణంలోని చేనేత పారిశ్రామిక సహకార సంఘం నందు రిటర్నింగ్ అధికారి షేక్ బాజీ పర్యవేక్షణలో జరిగిన ఈ ఎన్నికల్లో నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డైరెక్టర్లుగా ఎన్నికైన 9మంది అధ్యక్ష కార్యదర్శులను ఏకగ్రీవంగా మంగళవారం ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా గండూరి రమేష్, ఉపాధ్యక్షులుగా చిలువేరు నరసింహారావు, కార్యదర్శిగా భీమనపల్లి వెంకటేశ్వర్లు, కోశాధికారిగా ముశం హరిప్రసాద్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
డైరెక్టర్లుగా ఎన్నికైన వారు ముశం యాదమ్మ , వీడం నీరజ ,పెద్ది శ్రీనివాస్ ,యలగందుల లక్ష్మయ్య ,యలగందుల సాయికుమార్ లు ఎన్నికయ్యారు ఈ సందర్భంగా నూతన కమిటీ మాట్లాడుతూ చేనేత కార్మికుల సంక్షేమం కోసం సంఘ అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిపారు.
సహకార సంఘం ఎన్నికలు అందరి సహకారంతో ప్రశాంతంగా ముగిసిందని తెలిపారు. తమ ఎన్నికకు సహకరించిన సంఘ సభ్యులకు, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు.
