• గోవింద నామస్మరణల నడుమ భక్తులను కటాక్షించిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి
• అప్పలాయగుంట బ్రహ్మోత్సవాల్లో ఆధ్యాత్మిక పారవశ్యం
తిరుపతి, 2026 జూన్ 29: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో సోమవారం రాత్రి జరిగిన గరుడవాహన సేవ అపూర్వ భక్తి వైభవాన్ని సంతరించుకుంది. శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారు గరుడవాహనంపై దివ్యమంగళ విహారం చేస్తూ భక్తులకు అభయప్రదానమిచ్చారు.
రాత్రి 7.30 గంటలకు ప్రారంభమైన గరుడవాహన సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని “గోవింద… గోవింద…” నామస్మరణలతో ఆలయ పరిసరాలను మార్మోగించారు. అడుగడుగునా కర్పూర హారతులు సమర్పిస్తూ స్వామివారి దివ్యరూపాన్ని దర్శించుకుని పరమానందాన్ని పొందారు.
అంతకుముందు ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 5 గంటలకు ఊంజల్ మండపానికి వేంచేపు, అనంతరం 5.30 నుంచి 6.30 గంటల వరకు ఊంజల్ సేవను వైభవంగా నిర్వహించారు.
