• బహుజన సమాజ్ పార్టీ(బిఎస్పీ)
తెలంగాణ ఎక్స్ ప్రెస్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని అసెంబ్లీ కమిటీ ఆధ్వర్యంలో, బిఎస్పీ రాష్ట్ర రథసారధి, రాష్ట్ర అధ్యక్షులు, మాజీ డిప్యూటీ మేయర్ బడంగ్ పేట్ ఇబ్రాం శేఖర్ 52 వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృథ్వీరాజ్, ఉమ్మడి జిల్లా జోన్ ఇంచార్జ్ లు – పార్టీ సీనియర్ నాయకులు బీసమోళ్ళ యోసేపు, అంతటి నాగన్నలు, పార్లమెంట్ ఇంచార్జ్ సి.కళ్యాణ్, జిల్లా అధ్యక్షులు బోనాసి రాంచందర్ అడ్వకేట్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోనీ బ్లడ్ బ్యాంక్ లో రక్తదాన శిబిరం నిర్వహించారు. నాగర్ కర్నూల్ అసెంబ్లీకి చెందిన 15మంది యువ నాయకులు రక్తాన్ని దానం చేశారు. ఆ తదనంతరం జిల్లా కేంద్రంలో గల బాబాసాహెబ్ డా.బి.ఆర్. అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ ఇబ్రాం శేఖర్ దాదాపు రెండున్నర దశాబ్దాలుగా(25 సం.రాలుగా) తెలుగు నేలపై బహుజన వాదాన్ని బలంగా వినిపిస్తున్నారనీ పేర్కొన్నారు. బాలాపూర్ గ్రామంలో సర్పంచ్ గా గెలిచిన, బాలాపూర్ మున్సిపల్ లో కౌన్సిలర్ గా గెలిచినా, కార్పొరేటర్ గా గెలిచి బడంగ్ పేట్ డిప్యూటీ మేయర్ గా పూర్తి 5సం.రాలు పనిచేసిన బిఎస్పీ పార్టీనీ వదిలి పెట్టలేదని గుర్తు చేశారు.
ఈ కాలంలో నాయకులు ఏ పార్టీ అధికారంలో ఉంటే – అధికార పదవుల్లో ఉండే వాళ్ళు అక్కడే ఉంటున్నారనీ కానీ ఇబ్రాం శేఖర్ గారు పార్టీ మారలేదని కొనియాడారు. బహుజన మహనీయులైన మహాత్మా ఫూలే, బాబాసాహెబ్ డా. అంబేద్కర్, మాన్యవర్ కాన్షిరాం, బేహేన్ జీ మాయావతి గార్ల జీవిత చరిత్రల పుస్తకాలు వేలాదిగా స్వంత ఖర్చులతో ప్రింట్ చేయించి, వేలాది పుస్తకాలు తెలుగు నేలపై ఉచితంగా పంచుతూ – బహుజన వాదాన్ని సజీవంగా ఉంచుతున్నారని స్పష్టం చేశారు. రాష్ట్ర అధ్యక్షులుగా పదవి బాధ్యతలు తీసుకున్న తరవాత రాష్ట్రములో బేహేన్ జీ మాయావతి ఆశీస్సులతో 120 కి పైగా వార్డ్ మెంబర్స్, 9 ఉప సర్పంచ్ లు, 4 సర్పంచ్ లు, 2 కార్పొరేటర్లను గెలిపించారని తెలిపారు. తెలంగాణ స్వరాష్ట్రము సిద్ధించాక స్థానిక ఎన్నికల్లో కొంతకాలం ఏనుగు గుర్తు లేదని, ఇబ్రాం శేఖర్ రాష్ట్ర అధ్యక్షులు అయ్యాక ఏనుగు గుర్తును తీసుకుని వచ్చారని మాట్లాడారు. సోదరి కుమారి మాయావతిని నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రములో బహుజనులకు రాజ్యాధికారం సిద్దించే వరకూ విశ్రమించమనీ, బహుజనులు కూడా పార్టీలకు అతీతంగా ఏకం అయి బహుజన రాజ్యం తెచ్చుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృధ్వీరాజ్. ఉమ్మడి జిల్లా జోన్ ఇన్చార్జులు పార్టీ సీనియర్ నాయకులు బీసమోళ్ళ యోసేపు. అంతటి నాగన్న. పార్లమెంట్ ఇంచార్జి సి కళ్యాణ్. జిల్లా అధ్యక్షులు బోనసి రామచందర్ అడ్వకేట్ పాల్గొన్నారు.
