న్యూస్ డెస్క్: శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని మహిళల ఆర్థిక అభివృద్ధి, సామాజిక సాధికారత కోసం మా కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా నేడు వెలుగు సంఘమిత్రులకు సెల్ ఫోన్లను పంపిణీ చేసే శుభ కార్యక్రమాన్ని మన కార్యకర్తలు మరియు నాయకుల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. శ్రీకాళహస్తి, తొట్టంబేడు, రేణిగుంట మరియు ఏర్పేడు మండలాల్లోని 200 మంది సంఘమిత్రులకు సుమారు రూ. 37 లక్షల వ్యయంతో అత్యాధునిక సాంకేతికత కలిగిన మొబైల్ ఫోన్లను అందజేశాము. మహిళా లోకానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఈ అడుగు వేశాము. ప్రభుత్వ పథకాలు మరియు సమాచారం వేగంగా ప్రతి ఇంటికీ చేరాలనే ఉద్దేశంతో ఈ సెల్ ఫోన్ల పంపిణీని చేపట్టాము. పొదుపు సంఘాల నిర్వహణలో మహిళలు మరింత పారదర్శకంగా, వేగంగా రాణించేందుకు ఈ మొబైల్ ఫోన్లు ఎంతో దోహద పడతాయని మన ముఖ్యమంత్రి విజన్ మేరకు ప్రతి మహిళను ఆర్థికంగా బలోపేతం చేయడమే మన ప్రభుత్వం లక్ష్యం అని తెలిపారు.

By Editor

Digital journalist and media professional delivering accurate breaking news, impactful storytelling, and engaging content across modern platforms.