తెలంగాణ ఎక్స్ ప్రెస్, జూన్ 25: కామారెడ్డి జిల్లా కేంద్రంలో మాదకద్రవ్యాల నివారణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డ్రగ్స్ రహిత సమాజం కోసం మనము అందరం కృషి చేయాలి యువత వీటికి చాలా దూరంగా ఉండాలని అన్నారు. డ్రగ్స్ వాడుతున్న వారిని గుర్తించేందుకు ప్రత్యేక అధికార బృందాలు పనిచేస్తున్నాయి, వీటిని వినియోగించే వారికి కఠిన చర్యలు ఉంటాయి. డ్రగ్స్ మాయలో పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు.నిరంతరం అన్ని శాఖల సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విద్యా సంస్థల్లో వివిధ శాఖలు డ్రగ్స్ నివారణ పట్ల కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు పాల్గొన్నారు.