• బీజేపీ విజయోత్సవ సంబరాల్లో దశరథ లక్ష్మీ

న్యూస్ డెస్క్ : రానున్న రోజుల్లో ఏ ఎన్నికైనా తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ మహిళా మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దశరథ లక్ష్మీ అన్నారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి మూడు రాష్ట్రాలలో బీజేపీ గెలుపుతో గంగోత్రి పర్యటనలో ఉన్న దశరథ లక్ష్మీ పార్టీ మహిళా కార్యకర్తలు, నేతలతో విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు బీజేపీని ఆదరించారని అన్నారు. కార్యకర్తలు, నాయకులు పార్టీ అభివృద్ధికి మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈనెల 10న నగరంలో జరిగే ప్రధాని నరేంద్రమోదీ సభను విజయవంతం చేయాలన్నారు. పార్టీ మహిళా ప్రతినిధులు వరాల జ్యోతి, రేణుక ముదిరాజ్, కరుణ యాదవ్, తులసి, లలిత, పార్వతి, మాధవి, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.