న్యూస్ డెస్క్ : బక్రీద్ పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరంలో గోవధ నిరోధానికి తగిన చర్యలు తీసుకోవాలని లవ్ ఫర్ కౌ ఫౌండేషన్ ట్రస్టీ రిధేష్ జాగీర్ధార్ ఆధ్వర్యంలో ప్రతినిధులు బుధవారం నగర సీపీ విసి సజ్జనార్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం లవ్ ఫర్ కౌ ఫౌండేషన్ మెమోంటోను బహుకరించి సజ్జనార్ ను సత్కరించారు. నగరంలో గోవధ నిరోదక చట్టం సమర్థవంతంగా అమలయ్యే విధంగా చూడాలని వారు విజ్ఞప్తి చేశారు. గోవధతో తెలంగాణలో వాటి సంతతి తగ్గిపోతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గో సంరక్షణ సంస్థల ప్రతినిధులు రితీష్ జాగీర్దార్, ప్రవీణ్ పాండ్య, జస్రాజ్ శ్రీమల్, మురళీమనోహర్ పలోడ్, దీపక్ సింగ్, ఎ.బాలక్రిష్ణ, శ్రీకాంత్, బి.నరసింహ మూర్తి తదితరులు పాల్గొన్నారు.