న్యూస్ డెస్క్ : ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలు భాగంగా రైతు వారోత్సవాలు చేవెళ్ల మండలంలోని అన్ని రైతు వేదిక యందు రైతు వారోత్సవాలు ఘనంగా జరిగాయి. చేవెళ్ల మండల వ్యవసాయ అధికారి శంకర్లాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ రైతు వారోత్సవాల్లో రైతు వేదిక వ్యవసాయ విస్తరణ అధికారులు బాల కోటేశ్వరరావు, రమ్య, ప్రతిభ, వరుణ్ కుమార్ రైతు వారోత్సవ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేవర సమతా వెంకట్ రెడ్డి హాజరై ప్రసంగిస్తూ….రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకొని భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువుల యజమాన్యం పాటిస్తూ, సమగ్ర ఎరువుల యాజమాన్య పద్ధతుల ద్వారా వ్యవసాయం చేయాలని రైతులకు సూచించారు. మండల వ్యవసాయ అధికారులు శంకర్ లాల్ మాట్లాడుతూ నేల ఆరోగ్య పరిరక్షణ, సమతుల ఎరువుల వినియోగం, సహజ వ్యవసాయం, నాణ్యమైన విత్తనాల వినియోగం గురించి రైతులకు శాస్త్రీయ పద్ధతులపై అవగాహన కల్గించారు. రైతులకు భూసార పరీక్ష ఫలితాల కార్డుల పంపిణీ చేసి భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా రైతులు ఎరువుల యాజమాన్యం పాటించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు గౌడ్, కౌన్సిలర్లు శైలజ ఆగి రెడ్డి,అన్ని వార్డులకు కౌన్సిలర్లు మండలంలోని అన్ని గ్రామాల సంబంధించిన సర్పంచులు,రైతులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *