• నేతన్నలకు వైద్య శిబిరం ప్రారంభించిన సర్పంచ్ సంతోష్ గౌడ్

న్యూస్ డెస్క్ : చేనేత కార్మికుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నేతన్నకు ఆరోగ్య భద్రత పేరిట ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాధపురం గ్రామంలోని శ్రీ రఘునాథ మార్కండేయ పద్మశాలి సంఘ భవనంలో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరాన్ని సోమవారం పద్మశాలి సంఘం అధ్యక్షుడు బింగి బాలరాజు, మండల వైద్యాధికారి డాక్టర్ మోజెస్ రాజ్ లతో కలిసి సర్పంచ్ పల్లె సంతోష్ గౌడ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మండల వైద్యాదికారి డాక్టర్ మోజెస్ రాజ్ మాట్లాడుతూ చేనేత వృత్తిలో నిమగ్నమై ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ శిబిరం ఏర్పాటు చేసామని తెలిపారు.  వైద్య పరీక్షల శిబిరంలో పాల్గొన్న నేత కార్మికులకు సాధారణ ఆరోగ్య పరీక్షలతో పాటు, వృత్తి రీత్యా వచ్చే కంటి సమస్యలు, వెన్నునొప్పి, మరియు ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి నిపుణులైన వైద్యులు పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశామని వివరించారు. ఈ మెడికల్ క్యాంపులో 99 మంది చేనేత కార్మికులకు చికిత్సతో పాటుగా మరో 17 మందిని భువనగిరి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ రెఫర్ చేశామని తెలిపారు. మారుమూల ప్రాంతాల్లోని కార్మికులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనరల్ ఫిజీషియన్ డాక్టర్ కిరణ్, డాక్టర్ నబీలా ఆప్తమాలజిస్ట్, సూపర్వైజర్ విజయలక్ష్మి, చైతన్య, మానస, ఉషారాణి, హెల్త్ అసిస్టెంట్ ఉపేందర్, కవిత, టీబి సూపర్వైసర్ జ్యోతి, ల్యాబ్ టెక్నీషియన్ నటేష్, ఎక్సరే టెక్నీషియన్ ఉమేష్ ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *