న్యూస్ డెస్క్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం పెద్దంపేట గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఇటీవల జరిగిన పదవ తరగతి ఫలితాల లో మంచి మార్కుల తో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని బీసుల లావణ్య రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులను శాలువాలతో సత్కరించి వారి ప్రతిభను కొని యాడారు అదే స్ఫూర్తితో గ్రామంలో విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ సన్మానం ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ బిసుల లావణ్య రాజేష్ తెలిపారు.మంచి మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించి గ్రామానికి మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రమశిక్షణతో చదువుకుంటూ ఉన్నత విద్యను సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీసుల లావణ్య రాజేష్,ఉపసర్పంచ్ గడ్డం రాజు గౌడ్ ,వార్డ్ సభ్యులు చిడం సంజీవ్,తడండ్ల మాళవిక,గౌరవేని మల్లీశ్వరి,దుర్గం సమ్మక్క , కుర్సం లక్ష్మణ్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
