న్యూస్ డెస్క్ : వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల దాహార్తి తీర్చేందుకు హనుమకొండ బస్టాండ్ వెనుక గల కాకాజీ కాలనీలో అభయ హాస్పిటల్ వారి సౌజన్యంతో థౌజెండ్ పిల్లర్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం ఉచిత చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రం ద్వారా ఆసుపత్రులకు చికిత్స నిమిత్తం వివిధ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే పేషెంట్లు, వారి కుటుంబ సభ్యులు మరియు స్థానిక ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించనున్నారు.

ఈ కార్యక్రమాన్ని ఎలెక్టెడ్ గవర్నర్ లయన్ నరహరి సుధాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హనుమకొండ ప్రాంతంలోని ఆసుపత్రులకు ప్రతిరోజూ గ్రామీణ ప్రాంతాల నుంచి అనేక మంది పేషెంట్లు వస్తుంటారని, వేసవి వేడిలో వారికి చల్లని తాగునీరు అందించడం ఎంతో సేవామయ కార్యక్రమమని అన్నారు. సమాజ సేవలో భాగంగా లయన్స్ క్లబ్ చేపడుతున్న ఇలాంటి కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు.

థౌజెండ్ పిల్లర్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పరికిపండ్ల వేణు మాట్లాడుతూ, ప్రజలకు అవసరమైన సమయంలో సేవ చేయడం తమ క్లబ్ లక్ష్యమని తెలిపారు. ప్రధాన కార్యదర్శి వైద్యం రాజగోపాల్ మాట్లాడుతూ వేసవి కాలం ముగిసే వరకు చలివేంద్రం ద్వారా నిరంతరంగా తాగునీటి సౌకర్యం అందించనున్నట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఎలెక్టెడ్ జోనల్ చైర్ పర్సన్ డాక్టర్ గౌతమ్, డాక్టర్ భార్గవి, క్లబ్ సీనియర్ సభ్యులు లయన్ పాము శ్రీనివాస్, లయన్ చంద్రశేఖర్, గంజి నరహరి, మార్త పాపయ్య తదితరులు పాల్గొన్నారు.