జిల్లా కలెక్టరేట్లో ప్రధాన సమావేశ మందిరంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం 

న్యూస్ డెస్క్ : మహబూబాబాద్ కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన మే డే వేడుకలలో *అదనపు కలెక్టర్ రెవిన్యూ కె. అనిల్ కుమార్* ముఖ్య అతిదిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా ఉద్యోగ కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని కార్మిక వర్గాన్ని కోరారు. ఉద్యోగ కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పని చేస్తున్నదని అన్నారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కార్మికుల సంక్షేమంలో భాగంగా మే డేను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

జిల్లాలోని అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మే 2వ తేదీ నుండి 10వ తేదీ వరకు మే డే వార్షికోత్సవంలో భాగంగా కార్మిక శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. బాల కార్మికులకు సంబంధించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించడం జరుగుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా ఉత్తమ బోధకుడు శ్రీకాంత్ (శిక్షణ శాఖ), ఉత్తమ కర్మాగారముగా ఎన్ కే ఆగ్రో Exports ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మరియు బాల కార్మికుడిగా ఉండి కాపాడబడి తిరిగి చదువు కొనసాగించిన ఒక బాలుడీ కి ఉత్తమ పురస్కారాలను అందించి సన్మానించారు ఈ కార్యక్రమంలో సహాయ కార్మిక కమిషనర్ ఓ. రమేష్ , లేబర్ అధికారి క్రాంతి, జిల్లా ఉపాధి అధికారి టి రజిత , సి.డబ్ల్యు.సి చైర్మెన్ నాగావాణి, పంచాయతీ అధికారి హరిప్రసాద్, ఐటిఐ ప్రిన్సిపల్ బాబు, మరియు ఇతర శాఖలకు చెందిన అధికారులు, కళాకారులు, కార్మిక సోదర సోదరీమణులు మరియు కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *