తెలంగాణ ఎక్సప్రెస్ న్యూస్ : మహబూబాబాద్ జిల్లాలోని ఎస్టీ కులాలకు చెందిన వివిధ సమస్యల పరిష్కారం పై ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి సంబంధిత అధికారులతో హియరింగ్ (కేసుల విచారణ) నిర్వహించి సంబంధిత లబ్ధిదారులకు ప్రభుత్వ శాఖల నుండి తీసుకోవలసిన అంశాలు చర్యలపై దిశా నిర్దేశాలు చేశారు ఈ సందర్భంగా జాటోతు హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఈరోజు వివిధ సమస్యల పరిష్కారంపై దరఖాస్తు చేసుకున్న వారి యొక్క వినతు లను దరఖాస్తులను స్వీకరించి ప్రత్యేక కోర్టు ద్వారా (40) కేసులను విచారించడం జరిగిందని అన్నారు న్యాయమైన కేసులను తక్షణమే పరిష్కరించి బాధితులకు దరఖాస్తు దారులకు బాధ్యతాయుతంగా సహాయం చేయాలని ఈ కోర్టులో అధిక శాతం భూ సమస్యల పరిష్కారం పై వచ్చాయని రెవెన్యూ ఫారెస్ట్ ఎండోమెంట్ సంబంధిత శాఖల సమన్వయంతో కేసులను పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు జాటోతు హుస్సేన్ నాయక్ సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ అదనపు కలెక్టర్ రెవెన్యూ కె. అనిల్ కుమార్ ఇన్చార్జి అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు హౌసింగ్ పీడీ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.