తెలంగాణ ఎక్స్ ప్రేస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఖజాగుడ గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేయడంతో పాటు మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయిస్తామనిΚ గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తెలిపారు. ఖజాగుడ గ్రామంలోని ప్రజలు ఇటీవల తాము ఎదుర్కొంటున్న సమస్యలను మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్థానిక నేతలతో కలిసి సమస్యలపై గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ గంగాధర్ పాదయాత్ర చేశారు . ప్రధానంగా పురాతన భూగర్భ డ్రైనేజి పైపులైన్‌లతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పైపులు దెబ్బతినడం వల్ల డ్రైనేజి నీరు తరచుగా నిలిచిపోతూ, డ్రైనేజి నీరు ఓవర్‌ఫ్లో ఇళ్లలోకి చేరి రోజువారీ జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. పురాతన భూగర్భ డ్రైనేజి పైపులైన్‌లను ఆధునిక పైపులైన్‌లతో మార్చి భూగర్భ డ్రైనేజి పైపులైన్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. వీటితో పాటు పెండింగ్ లో ఉన్న సీసీ రోడ్లను పూర్తి చేయాలని గంగాధర్ రెడ్డిని కోరారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తక్షణమే స్పందించి అక్కడే ఉన్న అధికారులకు వాటిని నోట్ చేసుకొని వీలైనంత త్వరగా అందుకు అవసరమైన నిధులు కేటాయించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు ఆదేశించారు. పెరుగుతున్న జనాభా దృశ్య డ్రెయినేజీ పైప్ లైన్ డయా పెంచి లెవల్స్ తో అనుసంధానం చేస్తూ ఒక్క కాలనీ నుండి మరొక కాలనీ కి మధ్యన ఇబ్బందులు తల్లెత్తకుండ పనులు ప్రణాళిక బద్దంగా అన్ని కాలనీలకు దశలవారీగా మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని అన్నారు. వర్షాకాలంలో నీటి నిల్వలు, భూగర్భ డ్రైనేజీ ఓవర్‌ఫ్లో వంటి సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం కోసం సంబంధిత అధికారులు సమగ్ర సాంకేతిక నివేదికను సిద్ధం చేయాలని మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి సూచించారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి వినతిని నమోదు చేసి వాటి పరిష్కారానికి కాలపరిమితి నిర్ణయించి సంబంధిత శాఖలతో సమన్వయం చేస్తూ త్వరితగతిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ప్రజాధనం వృథా కాకుండా పూర్తి పారదర్శకతతో పనులు నిర్వహించాలని సూచించారు. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి పైప్‌లైన్లు, సీసీ రోడ్లు, స్ట్రీట్ లైట్లు, వర్షపునీటి కాలువలు వంటి అన్ని మౌలిక వసతులను సమగ్రంగా అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అభివృద్ధి పనులు పూర్తయ్యే వరకు సంబంధిత శాఖల అధికారులతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ పనుల పురోగతిని స్వయంగా పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని ప్రతి కుటుంబానికి మెరుగైన మౌలిక వసతులు అందే వరకు నిరంతరం ప్రజల మధ్యే ఉండి వారి సమస్యల పరిష్కారానికి అంకితభావంతో కృషి చేస్తానని గంగాధర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షులు శివ సింగ్, హెచ్ఎండబ్ల్యుఎస్ మేనేజర్ భాస్కర్,అరుణ్ గౌడ్, సుధాకర్, కిషోర్ , రాజేష్, నిర్మల, భారతి, సుమన్, శ్రీశైలం,అరుణ్ కుమార్, నవీన్ యాదవ్, రాజేష్, నరేష్, అరవింద్ గౌడ్, సింగ్,రాజు,స్థానిక నేతలు, బస్తీ వాసులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.