తెలంగాణ ఎక్స్ ప్రెస్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఉపాధ్యాయులు జయ మధుకర్ రావు సౌజన్యంతో పాఠశాల విద్యార్థులకు మంగళవారం క్రీడా టీ-షర్టులను పంపిణీ చేశారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్పంచ్ కొండగొర్ల బాపు, ప్రధానోపాధ్యాయులు సురేందర్, ఆప్స్ చైర్మన్ శైలజ, భవిత సెంటర్ భవన నిర్మాణ కర్త మోత్కూరి రవి విద్యార్థులకు టీ-షర్టులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దాత జయ మధుకర్ రావు విద్యార్థులపై చూపుతున్న ప్రేమ, సహకారం అభినందనీయమని తెలిపారు. చదువుతో పాటు క్రీడల్లో కూడా విద్యార్థులు రాణించాలని ఆకాంక్షించారు. క్రీడా దుస్తుల వల్ల విద్యార్థుల్లో ఉత్సాహం పెరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ మాచర్ల శైలజ, ఉపాధ్యాయులు మంజుల, ప్రకాష్, రఘుపతి, అజ్మత్ పాషా, సిఆర్పి కవిత, పిడి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.