తెలంగాణ ఎక్స్ ప్రెస్, శేరిలింగంపల్లి: చందానగర్‌లో జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా విద్యా నర్సింగ్ హోమ్ వైద్యులు జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ మెడికల్ ఆఫీసర్, ప్రముఖ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ నాగేశ్వరరావును కాంగ్రెస్ పార్టీ నాయకులు మిరియాల ప్రీతమ్ ఘనంగా సన్మానించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మిరియాల ప్రీతమ్ మాట్లాడుతూ, సమాజ ఆరోగ్య పరిరక్షణలో వైద్యుల సేవలు ఎనలేనివని తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ప్రతి వైద్యుడు సమాజానికి నిజమైన సేవకుడని అన్నారు. ముఖ్యంగా డాక్టర్ నాగేశ్వరరావు ఎన్నో ఏళ్లుగా అంకితభావంతో, మానవీయ దృక్పథంతో వైద్యసేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందడం అభినందనీయమని కొనియాడారు. ప్రజా సేవలో వైద్యుల పాత్రను ఎల్లప్పుడూ గౌరవిస్తామని, ఇలాంటి సేవాభావం కలిగిన వైద్యులను ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మిరియాల యామిని, దివ్య తదితరులు పాల్గొని డాక్టర్ నాగేశ్వరరావుకి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా సన్మానించారు.