న్యూస్ డెస్క్: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి బుధవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు.
వేద ఆశీర్వచనం: ఆలయ పండితులు స్వస్తి వచనాలతో ఎంపీ వేం నరేందర్ రెడ్డికి స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్న నరేందర్ రెడ్డి దంపతులు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కూడా పాల్గొన్నారు. ఆలయ ముఖమండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ ఈవో భవానీ శంకర్ స్వామివారి తీర్థ ప్రసాదాలు మరియు చిత్రపటాన్ని అందజేశారు.